ప్రముఖ కంపెనీ అమెజాన్ మరోసారి భారీ లే ఆఫ్స్‌కు సిద్దమైంది. ఈ ఏడాది మే నాటికి ప్రపంచవ్యాప్తంగా 14వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. AIలో భారీ పెట్టుబడులు పెడుతుండటంతో ఖర్చులను తగ్గించుకోవడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా AWS, రిటైల్, HR విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనవరిలో 16వేల మందిని అమెజాన్ తొలగించింది.