భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా రూ.799 ప్లాన్(1.5GB/రోజుకు) ధరను రూ. 100 పెంచి రూ. 899గా నిర్ణయించింది. అలాగే, రూ. 859 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. పెంచిన ఈ కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
ADB: ఉట్నూర్ మండలంలోని వేణునగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కనక రామారావు పదవి విరమణ ఆత్మీయ అభినందన సభ స్టార్ ఫంక్షన్ హాల్లో జరిగింది . ఈ కార్యక్రమానికి ఖానాపూర్ MLA , నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి రామారావు దంపతులను శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
TG: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవనున్నట్లు సొసైటీ కార్యదర్శి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30 డిగ్రీ కళాశాలల్లో BSC, B.COM, BA వంటి సాంప్రదాయ కోర్సులతో పాటు BBA, యానిమేషన్ &VFX వంటి కోర్సులు కలిపి మొత్తం 31 కోర్సుల్లో 9,260 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,780 వద్ద ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,800 గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. ఈ ఏడాది చివరికల్లా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1.85 లక్షలకు చేరవచ్చని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న డిమాండే ఇందుకు ప్రధాన కారణాలు. గత ఏడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటివరకు ధరలు 60% పెరగడం గమనార్హం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కంటే బంగారంపై పెట్టుబడే సురక్షితమని ఈ నివేదిక స్పష్టం చేసింది.
AP: పాలిసెట్-2026 హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి సత్యనారాయణ మూర్తి వెల్లడించారు. ప్రవేశ పరీక్షను ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009కు మెసేజ్ చేసి, లేదా వెబ్‌సైట్ https://polycetap.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మెమరీ చిప్‌ల కొరత, AI సాంకేతికత వాడకం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో బడ్జెట్ ధరలో దొరికిన ఫోన్లు ఇప్పుడు ఖరీదైనవిగా మారుతున్నాయి. చిప్ తయారీదారులు ఏఐ కంపెనీలపై దృష్టి పెట్టడంతో సరఫరా తగ్గి ధరలు పెరిగాయి. ఈ ప్రభావం ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, టీవీలపై కూడా పడనుంది.
TG: పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ దరఖాస్తు గడువు ఈనెల 20వ తేదీతో ముగియనుంది. రూ.100 లేట్ ఫీజుతో 21వ తేదీ వరకు, రూ.300 ఫైన్‌తో 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మెరిట్ ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(MCL) 500 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టులను అనుసరించి 10/ITI/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తుకు అర్హులు. అప్లికేషన్ ప్రక్రియ మే 7న ప్రారంభం కానుండగా.. ఆసక్తి గలవారు మే 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. UR/OBC/EWSలకు దరఖాస్తు ఫీజు రూ.1,180. మిగిలినవారికి ఫీజు లేదు.
TG: రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి, 7-10 తరగతుల్లో ఖాళీ సీట్ల ప్రవేశాలకు రేపు పరీక్ష జరగనుంది. 6వ తరగతిలో ప్రవేశానికి 23వేలకు పైగా, మిగతా తరగతులకు 37వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన, బాలికలకు భోజనం, హాస్టల్ వసతి ఉంటుంది. IIT, JEE, NEET, ఎంసెట్, CA, TPT పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,42,800 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,80,000 ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కంపెనీ భారీగా ఉద్యోగాల కోత విధించేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 20 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన సిబ్బందిలో తొలి విడతగా 10% ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. దీంతో దాదాపు 8 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో మరిన్ని లేఆఫ్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది.
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. చమురు నౌకల రాకపోకలను అడ్డుకోమని హామీ ఇచ్చింది. ఇరాన్ ప్రకటనతో ముడిచమురు ధరలు భారీగా పడిపోయాయి. క్రూడాయిల్ ధరలు 10 శాతం మేర పడిపోయాయి. ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్-2025 పేపర్-IIకు సంబంధించిన ప్రాథమిక కీ, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లను SSC విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రెస్పాన్స్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19 వరకు రూ.50 ఫీజు చెల్లించి కీపై తమ అభ్యంతరాలను తెలపవచ్చు.
దేశంలో 2025-26లో బంగారం దిగుమతులు 24 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. మొత్తం 71.98 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని మన దేశానికి దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 58 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2023-24లో 45.54 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది.