ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ క్షమాపణలు చెప్పారు. కెనడాలో 9 మంది మరణానికి కారణమైన 18 ఏళ్ల వాన్ రూట్సెల్లార్ ప్రవర్తనను గుర్తించి చాట్ జీపీటీ ఖాతాను గత జూన్ నెలలోనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కానీ ఈ విషయంపై పోలీసులు అప్రమత్తం చేయలేకపోయినందుకు చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మరణించిన వారి కుటుంబ సభ్యులను క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు.