CRPFలో 9,175 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో 504, TGలో 356 పోస్టులున్నాయి. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI పాసైన వారు అర్హులు. వయసు 18-23 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 19. వెబ్సైట్: https://www.rect.crpf.gov.in