దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ జేఈఈ మెయిన్ తుది కీ విడుదలైంది. అలాగే, ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది. ఈరోజు ఫలితాలు విడుదల చేస్తామని NTA ఇప్పటికే ప్రకటించింది. దీంతో జేఈఈ మెయిన్ రాసిన విద్యార్థుల తుది మెరిట్ లిస్ట్ ఏ సమయంలోనైనా https://jeemain.nta.nic.in/ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.