ఇండియన్ రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) ఉద్యోగాలకు ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ బోర్డు పరిధిలో 1,420 జాబ్స్ ఉన్నాయి. టెన్త్, ITI/డిప్లొమా, ఇంజినీరింగ్ పాసైన వారు అర్హులు. 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. 2 ఆన్‌లైన్ ఎగ్జామ్స్, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/
పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో, ఎగుమతిదారులు అక్రమ లాభాలు పొందకుండా మార్చి 26న విండ్‌ఫాల్ ట్యాక్స్ తెచ్చారు. దీనివల్ల దేశీయంగా ఇంధన కొరత లేకుండా లభ్యత పెరిగింది. అప్పటి నుంచి మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ఏప్రిల్, మే నెలల్లో పలుమార్లు ఈ పన్నులను సవరించిన కేంద్రం, తాజా సమీక్షలో వీటిని మరింత దిగువకు చేర్చింది.
ఇంధన ఎగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం(ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం లీటర్ పెట్రోల్‌పై పన్ను రూ.1.5, డీజిల్‌పై రూ.13.5, ఏటీఎఫ్‌పై రూ.9.5కు తగ్గింది. అయితే దేశీయంగా వాహనదారులకు మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు.
నిరుద్యోగులకు ఇండియన్ ఆర్మీ సువర్ణావకాశం కల్పించింది. ఇండియన్ ఆర్మీలో నేరుగా లెఫ్టినెంట్ హోదాతో పర్మనెంట్ కమిషన్డ్ ఆఫీసర్‌గా స్థిరపడేందుకు అవకాశం కల్పించే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-56) నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.inను సంప్రదించండి.
స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి SBI నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 100 ఖాళీలలో 88 రెగ్యులర్ పోస్టులు కాగా, 12 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి.
ఆన్‌స్క్రీన్ మార్కింగ్‌కు సంబంధించిన ఆన్‌మార్క్ పోర్టల్‌లో వెలుగు చూస్తున్న లోపాలను పరిశీలిస్తున్నట్లు CBSE తెలిపింది. ఈ వ్యవస్థలను పటిష్టం చేయడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందం రంగంలోకి దిగినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే గుర్తించిన సమస్యలను సరిచేసినట్లు చెప్పింది. ఇంకా ఏవైనా లోపాలు ఉన్నాయా? అనేది పరిశీలిస్తూ కట్టడి చేస్తున్నట్లు పేర్కొంది.
TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)-2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 16 నుంచి 22 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీ టెట్ కన్వీనర్ జి.రమేష్ తెలిపారు. మొత్తం 1,36,418 దరఖాస్తుల్లో 28,149 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు BSNL అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16,400 నుంచి రూ.40,500 వరకు వేతనం లభిస్తుంది.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్, ఇంటర్-2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ స్కోర్‌కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ telanganaopenschool.orgలో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది టెన్త్, ఇంటర్ థియరీ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 వరకు రోజుకు రెండు సెషన్లలో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఎల్పీజీ కొరతను అరికట్టడానికి కేంద్రం ‘ఒక ఇంటికి ఒకే కనెక్షన్’ నిబంధన తెచ్చింది. ఆల్రెడీ PNG సౌకర్యం ఉండి LPG వదులుకోని వారి కనెక్షన్లు జూన్ 1 నుంచి ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే డేటాబేస్‌ను అనుసంధానించడం పూర్తి చేశాయి. కాబట్టి గడువు ముగిశాక వీరు సిలిండర్ రీఫిల్లింగ్ బుక్ చేసుకోలేరు.
ATP: గుంతకల్లు పట్టణంలోని సక్సెస్ హై స్కూల్ ఎదురుగా PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు రాజేష్ మాట్లాడుతూ.. హైస్కూల్లో సరైన మౌలిక వసతులు లేవని, విద్యార్థుల తల్లిదండ్రులతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఇలాంటి పాఠశాలలను సీజ్ చేయాలన్నారు.
RRB టెక్నీషియన్ గ్రేడ్-3 CBT ఫలితాలు విడుదలయ్యాయి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌కు ఎంపికైన వారి జాబితా రీజియన్ల వారీగా RRB వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది. కాగా, 6,055 ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షలకు దాదాపు 15 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఈ పరీక్షల ఫలితాలను మే 30న ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ స్కోర్‌కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ telanganaopenschool.org ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దేశంలో కరెన్సీ మార్కెట్‌లో రూ.500 నోట్లతో పాటు నకిలీల బెడద పెరిగింది. గతేడాదితో పోలిస్తే నకిలీ రూ.500 నోట్లు 20% పెరిగాయని.. 1,41,907 నోట్లను గుర్తించామని RBI తెలిపింది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీలు 5.7% పెరిగాయి. మరోవైపు, ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లలో ఇప్పటివరకు 98.45% నోట్లు విజయవంతంగా బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు RBI తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.
రూ.2 వేల నోట్ల రద్దు తర్వాత కరెన్సీ మార్కెట్‌లో రూ.500 నోటు ‘బాద్‌షా’గా మారింది. చలామణీలో ఉన్న మొత్తం నోట్లలో సంఖ్యా పరంగా 41.2 శాతం, విలువ పరంగా ఏకంగా 86 శాతం వాటా దీనిదేనని RBI తాజాగా వెల్లడించింది. వీటి చలామణీ విలువ రూ.35.27 లక్షల కోట్లకు పెరిగింది. రూ.10 నోటు రెండో స్థానంలో నిలవగా.. ఆర్థిక వ్యవస్థలో నగదు డిమాండ్ ఇంకా కొనసాగుతోందని RBI పేర్కొంది.