ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ, మోడల్ కెరీర్ సెంటర్ వేదికగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగంలో 322 ఖాళీల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టారు. ఫార్మసిస్ట్ సీఎస్ఏ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.