యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) NET జూన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. నిన్నటితో గడువు ముగియాల్సి ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు డెడ్‌లైన్‌ను ఒక్కరోజు పొడిగించినట్లు NTA తెలిపింది. ఇవాళ రాత్రి 11:50లోగా అప్లై చేయడంతో పాటు ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఈనెల 26 నుంచి 28 వరకు కరెక్షన్స్‌కు అవకాశం ఇస్తామని చెప్పింది. సైట్: https://ugcnet.nta.nic.in/