AP: ఈఏపీసెట్‌కు హాజరైన అభ్యర్థులు తమ కనీస అర్హత పరీక్ష ఇంటర్ మార్కుల డిక్లరేషన్ ఇవ్వాలని విద్యామండలి ప్రకటించింది. ఈ డిక్లరేషన్‌కు రేపే చివరి తేదీ. ఈఏపీసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్ బోర్డు, RGUKT విద్యార్థుల మార్కులు ఇప్పటికే EAPCET డేటాబేస్‌తో అనుసంధానమై ఉండటంతో అవి డిక్లరేషన్ ఫామ్‌లో కనిపిస్తాయి.