TG: రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి ఐదు ప్రపంచశ్రేణి లైఫ్ సైన్సెస్ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఈ రంగంలో రానున్న ఐదేళ్లలో 5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా తెలంగాణ నెక్ట్స్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని మంత్రిమండలి ఆమోదించింది. ఇందుకు గ్రీన్ ఫార్మాసిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.