HDFC బ్యాంక్ తన రుణగ్రహీతలకు తీపి కబురు అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వ్యక్తిగత రుణాలపై EMI భారం తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.