ద్విచక్ర వాహనాన్ని కొనాలనుకునే వారికి ఓలా ఎలక్ట్రిక్ శుభవార్త చెప్పింది. టీ20 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకున్న నేపథ్యంలో కంపెనీ ‘ఛాంపియన్ మహోత్సవ్’ను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఓలాకు చెందిన అన్ని వాహనాలపై రూ.10 వేల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. 3 రోజుల పాటు ఈ ఆఫర్ అమలులో ఉంటుందని చెప్పింది. ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకోవాలని వినియోగదారులకు సూచించింది.