TG: రాష్ట్రంలో 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సాయంత్రం బీటెక్ కోర్సులను అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో విద్యాశాఖ జీవో 30 జారీ చేసింది. ఒక్కో కాలేజీకి 1 నుంచి 5 కోర్సులకు అనుమతి దక్కింది. ఒక్కో కోర్సులో కనిష్ఠంగా 15 నుంచి గరిష్ఠంగా 60 సీట్లున్నాయి. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు.