కడప నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలు, స్పెషల్ పార్టీ సిబ్బందితో అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచారు. పారిపోయే నిందితులను డ్రోన్ సాయంతో గుర్తించి పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.