MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 9 చివరి అవకాశమని ప్రిన్సిపల్ శంకర్ బుధవారం తెలిపారు. 1 నుంచి 6 సెమిస్టర్లకు సంబంధించిన పరీక్ష ఫీజు గడువు ఈనెల 7తో ముగియగా, రూ.50 ఆలస్య రుసుముతో ఈనెల 9 వరకు పొడిగించారన్నారు. ఈ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష ఫీజు తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు.