హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,62,380కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 పెరిగి రూ.1,48,850 పలుకుతోంది. అటు కిలో వెండి ధర ఒక్కరోజే రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.