మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన పేరుతో ఖాతాదారుల నుంచి గత మూడేళ్లలో ప్రైవేట్ బ్యాంకులు రూ.11 వేల కోట్లు వసూలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. HDFC బ్యాంక్ అత్యధికంగా రూ.3800 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.2,700 కోట్లు, ICICI బ్యాంక్ రూ.1200 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.