చాలా మంది పడకపైకి వెళ్లిన తర్వాత గంటల తరబడి నిద్ర కోసం పోరాటం చేస్తుంటారు. ఇలా ఇబ్బంది పడేవారి కోసం నిపుణులు కొన్ని సూచనలు చేశారు. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం, నిద్రపోవడానికి ముందు ఫోన్, టీవీ, లాప్టాప్లకు దూరం, యోగాసనాలు చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.