చర్మతత్వానికి నప్పే లోషన్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖానికి క్రీమ్‌లు రాసే ముందు చర్మాన్ని శుభ్రం చేయాలి. చర్మం కాస్త తడిగా, వెచ్చగా ఉన్నప్పుడు వీటిని రాస్తే రంధ్రాల్లోకి సులభంగా ఇంకి, తేమను కాపాడతాయి. అందుకే స్నానం చేసిన వెంటనే లోషన్ రాయడం మంచిది. చర్మం చల్లగా ఉంటే గోరువెచ్చని టవల్‌తో తుడుచుకున్నాక అప్లై చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.