మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలను భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారంలో కనీసం మూడు సార్లు తోటకూర, పాలకూర వంటివి పప్పు లేదా వేపుడు రూపంలో తీసుకోవాలి. వీటిలో ఉండే ఐరన్, కాల్షియం ఎముకల పుష్టికి, రక్తహీనత తగ్గడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా కంటిచూపు మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.