• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

అకర్ణ ధనురాసనం వల్ల కలిగే లాభాలు

అకర్ణ ధనురాసనం (విలుకాడు భంగిమ) శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇది విల్లును గీస్తున్న ఆర్చర్ వంటి భంగిమను పోలి ఉంటుంది. కాళ్లు, చేతులు, భుజాలు, వెన్ను కండరాలను బలంగా, శక్తివంతంగా చేస్తుంది. కాళ్లు, తొడలు, తుంటి కీళ్లను బాగా సాగదీసి శరీర వశ్యతను పెంచుతుంది. ఈ ఆసనం వేసేటప్పుడు దృష్టి ఒకే చోట కేంద్రీకరించాలి. ఏకాగ్రత, మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది.

April 27, 2026 / 06:14 AM IST

సగ్గుబియ్యంతో బోలెడు ప్రయోజనాలు

సగ్గుబియ్యంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వంటి సమస్యలకు సగ్గుబియ్యం జావ ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయి. ఎముకలు, కండరాలు బలంగా మారుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు సగ్గుబియ్యాన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. నరాల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. యాంగ్జైటీ, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి.

April 26, 2026 / 09:20 PM IST

చెప్పులు లేకుండా నడిస్తే..?

చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. నేలపై నేరుగా నడవడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాదాల్లోని నాడులు ఉత్తేజితమై రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అయితే రాళ్లు, ముళ్లు గుచ్చుకోకుండా చూసుకోవాలి. మధుమేహం ఉన్నవారు గాయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

April 26, 2026 / 04:15 PM IST

బొప్పాయితో మెరిసే చర్మం మీ సొంతం

పండిన బొప్పాయి ముక్కల పేస్ట్‌ను ముఖం, మెడకు పట్టించి 10 నిమిషాలు మర్దన చేసి కడగాలి. దీనికి తేనె, కలబంద కలిపితే మరిన్ని ఫలితాలుంటాయి. ఇది గోల్డెన్ ఫేషియల్‌లా మెరుపునిస్తూ, ట్యాన్‌ను తగ్గిస్తుంది. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సహజసిద్ధమైన మెరుపును పొందండి.

April 26, 2026 / 01:15 PM IST

వేసవిలో కూల్​డ్రింక్స్ తాగుతున్నారా?

ఎండలో ప్రయాణించేవారు తగు మొత్తంలో నీటిని తీసుకోవాలి. కాచి చల్లార్చిన, ఫిల్టర్ చేసిన మంచినీరు తీసుకోవచ్చు. దాహం తీరాక కొద్దిసేపటి తర్వాత జ్యూస్ తాగొచ్చు. మరీ చల్లని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదికాదు. ఎక్కువ వేడి లేదా ఎక్కువ చలి ఆరోగ్యానికి హానికరం. డీహైడ్రేషన్​ ఉన్నవారు అస్సలు కూల్​డ్రింక్స్​ తాగొద్దు. టీ, కాఫీ, ఆల్కాహాల్​ వంటివి వేసవిలో తీసుకోకపోవటం ఆరోగ్యానికి మంచిది.

April 26, 2026 / 09:33 AM IST

షుగర్ ఉంటే గాయాలు ఎందుకు మానవు?

రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు రక్తప్రసరణ సరిగా ఉండదు. రక్తం ద్వారా గాయానికి ఆక్సిజన్, పోషకాలు సరిపడా చేరకపోవడం వల్ల కొత్త కణాలు ఏర్పడే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీంతో గాయం త్వరగా మానదు. అదనంగా, డయాబెటిస్ వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల శరీరం బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే చిన్న గాయం పెద్ద సమస్యగా మారుతుంది.

April 26, 2026 / 08:26 AM IST

అతిగా నిద్రపోతున్నారా?

నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ఆరోగ్యానికి ప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో కొవ్వును పెంచి కీళ్లపై ఒత్తిడి కలిగిస్తుంది. కాబట్టి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ 7-8 గంటల మితమైన నిద్ర తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

April 25, 2026 / 08:24 PM IST

షుగర్ పేషెంట్లు వేసవిలో ఏం తినాలి?

షుగర్ ఉన్నవాళ్లు వేసవిలో అన్నం తగ్గించి, పెరుగు అన్నం, నిమ్మకాయ పులిహోర తీసుకోవడం మంచిది. పెరుగులోని ప్రోబయోటిక్స్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. పులిహోరలోని వేరుశెనగలు గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరిస్తాయి. అయితే, వీటిని సరైన పరిమాణంలో తీసుకోవడం ముఖ్యం. చక్కెర స్థాయిలు పెరగకుండా ఇవి సహాయపడతాయి.

April 25, 2026 / 05:48 PM IST

నిద్రలో కాళ్ల తిమ్మిర్లు వేధిస్తున్నాయా?

రాత్రిపూట కాళ్ల తిమ్మిర్లకు డీహైడ్రేషన్, తక్కువ రక్త ప్రసరణ ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీరు తగ్గితే ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతిని కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే రోజంతా తగినంత నీరు తాగి హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. అలాగే, నిద్రలో కండరాలకు రక్త ప్రవాహం తగ్గితే కూడా తిమ్మిరి, అసౌకర్యం కలుగుతాయి.

April 25, 2026 / 03:46 PM IST

14 రోజుల‌పాటు రోజూ ఒక కోడిగుడ్డును తింటే..?

14 రోజులపాటు రోజూ ఒక కోడిగుడ్డు తింటే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. గుడ్డులో ఉండే విటమిన్ A, B12, D, ప్రోటీన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే ‘కోలిన్’ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులోని ప్రోటీన్ వల్ల కండరాలు దృఢంగా మారి, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. లూటిన్, జియాక్సంతిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇది తింటే కడుపు నిండుగా అనిపించి, అనవసరపు ఆకలిని తగ్గిస్తుంది.

April 25, 2026 / 01:20 PM IST

గంటల తరబడి ఫోన్ స్క్రోలింగ్ చేస్తున్నారా?

షార్ట్ వీడియోల వ్యసనం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల తక్షణ ఆనందానికి అలవాటు పడి, ఏకాగ్రత, నిర్ణయాధికారం తగ్గుతాయి. ఫలితంగా పనులను వాయిదా వేసే ధోరణి పెరుగుతుంది. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించి.. పుస్తక పఠనం, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం.

April 25, 2026 / 11:10 AM IST

మండే ఎండల్లోనూ… ఫ్రెష్‌గా ఉండాలంటే..!

ఎండ వల్ల కమిలిన చర్మానికి, అలసిన కళ్లకు గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. గ్రీన్ టీని ఐస్ ట్రేలో గడ్డకట్టించి ముఖానికి రాస్తే రక్తప్రసరణ పెరిగి తాజాగా మారుతుంది. కీరాదోస గుజ్జులో నిమ్మరసం, తేనె కలిపి ఐస్ క్యూబ్స్‌లా వాడితే చర్మం కాంతివంతమవుతుంది. కలబంద ముక్కలతో మర్దన చేస్తే వేడి తగ్గుతుంది. గులాబీ నీరు, కీరారసం కలిపిన ఐస్ ముక్కలు కళ్ల ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.

April 25, 2026 / 10:36 AM IST

ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ..!

మనలో చాలామందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగనిదే రోజు ప్రారంభమవదు. కానీ దీని వల్ల ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పరగడుపున మజ్జిగ లేదా నీళ్లు తాగడం శరీరానికి మంచిదని చెబుతున్నారు. ఇది శరీరాన్ని చల్లబరిచి.. ఉత్తేజపరుస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢపరుస్తుంది. మజ్జిగలో ఉండే పోషకాలు బరువు తగ్గడంలోనూ సహాయపడతాయి.

April 25, 2026 / 10:05 AM IST

షుగర్ పేషంట్స్ మామిడిపండు తినొచ్చా?

మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను మితంగా తీసుకోవడం, సరైన సమయంలో తినడం ముఖ్యం. రోజుకు 100-150 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఒక చిన్న మామిడి పండులో సగం లేదా రోజుకు 1-2 ముక్కలు సరిపోతాయి. ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఆహారం తీసుకున్న 1-2 గంటల తర్వాత తినడం మంచిది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనానికి, సాయంత్రం స్నాక్స్‌కి మధ్యలో తీసుకోవడం మంచిది.

April 25, 2026 / 09:06 AM IST

విపరీత కరణి ఆసనం వల్ల కలిగే లాభాలు

విపరీత కరణి అనేది ఒక విలోమ యోగాసనం. ఒత్తిడిని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. నిత్యం 5-10 నిమిషాల సాధనతో మానసిక ప్రశాంతత, పొట్ట దగ్గర కొవ్వు తగ్గడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు. రోజంతా నిలబడటం లేదా కూర్చోవడం వల్ల వచ్చే కాళ్ల నొప్పులు, వాపులు, కండరాల అలసటను వెంటనే తగ్గిస్తుంది.

April 25, 2026 / 06:22 AM IST