వేసవిలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది. చెమట ద్వారా శరీరం నుంచి నీరు, లవణాలు తగ్గి అలసట, నీరసం, తలతిరగడం, తీవ్రమైన దాహం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. వీటితో పాటు పుచ్చకాయ జ్యూస్, మామిడి జ్యూస్, నిమ్మరసం, మజ్జిగ, నారింజ జ్యూస్, దానిమ్మ జ్యూస్ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.