• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

కరివేపాకును తీసి పారేస్తున్నారా..?

కరివేపాకు కేవలం పోపులో వేసే ఆకు మాత్రమే కాదు, ఇది పోషకాల గని. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, రేచీకటి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇందులోని ఐరన్, ఫోలిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే, కరివేపాకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

March 5, 2026 / 06:24 PM IST

మహిళలకు సమాన అవకాశాలు ఉన్నాయా?

భారత కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత పదవుల విషయంలో పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పురుషులు కోర్ బిజినెస్ పాత్రల్లో ఉంటే, మహిళలు ఎక్కువగా సహాయక విభాగాలకే పరిమితమవుతున్నారట. దీంతో ప్రమోషన్లలో మహిళలు వెనుకబడుతున్నారని, ఈ సమస్య వ్యక్తిగత ప్రతిభది కాదని, సంస్థాగత విధానాలదని చెబుతున్నారు. సమాన అవకాశాల కల్పనతో ఈ పరిస్థితుల మార్చవచ్చని అంటున్నారు.

March 5, 2026 / 06:08 PM IST

ఉసిరికాయతో కలిగే అద్భుత ప్రయోజనాలు!

ఉసిరికాయలో నారింజ కంటే 20 రెట్లు ఎక్కువగా ఉండే విటమిన్-C శరీర రోగనిరోధక శక్తిని అమాంతం పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. రోజూ ఒక ఉసిరికాయను తీసుకోవడం వల్ల రోగాల నుంచి రక్షణ పొందవచ్చు.

March 5, 2026 / 05:43 PM IST

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా జహీర్ ఖాన్..?

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం జూన్ 2026లో ముగియనుంది. దీంతో అగార్కర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే, హర్భజన్ సింగ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో భారత జట్టు 2024 T20 WC, 2025 CT గెలుచుకుంది. అలాగే, 2023 ODI WCలో ఫైనల్‌కు చేరింది.

March 5, 2026 / 05:27 PM IST

జుట్టు రాలుతోందా?.. ఇలా చేయండి!

కొన్ని చిట్కాలతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. కప్పు ఆముదంలో టీస్పూన్ రోజ్‌మేరీ ఆయిల్ కలిపి రోజూ రాత్రి కుదుళ్లకు పట్టించాలి.కొబ్బరి పాలు, ఆర్గన్ ఆయిల్ మిశ్రమాన్ని రాసి, షవర్ క్యాప్ పెట్టుకుని స్నానం చేస్తే జుట్టు మృదువుగా మారుతుందివారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేసి, మరుసటి రోజు గాఢత తక్కువ షాంపూతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

March 5, 2026 / 04:43 PM IST

మధ్యాహ్నం భోజనం మానేస్తున్నారా?

మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక నీరసం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి, సాయంత్రం వేళ అతిగా తినే ప్రమాదం ఉంది. ఇది బరువు పెరగడానికి, జీర్ణక్రియ మందగించడానికి దారితీస్తుంది. కాబట్టి సమయానికి మితంగా ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. పండ్లు లేదా మొలకలైనా తింటే మంచిది.

March 5, 2026 / 01:34 PM IST

ఎనిమిది ఆకృతిలో వాకింగ్ చేస్తున్నారా?

సాధారణ నడక కంటే ఎనిమిది ఆకృతిలో నడవడం (సిద్ధ నడక) వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకే సరళరేఖపై రెండు వస్తువులను ఉంచి, వాటి చుట్టూ 8 అంకె ఆకారంలో నడవడమే ఈ పద్ధతి. ఇది శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఏకాగ్రత పెరగడానికి, ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మెదడు చురుగ్గా మారుతుంది.

March 5, 2026 / 12:16 PM IST

బిర్యానీ ఆకుతో బోలెడు లాభాలు

బిర్యానీ ఆకు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మధుమేహ బాధితుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బిర్యానీ ఆకు కీలక పాత్ర పోషిస్తుంది.

March 5, 2026 / 11:10 AM IST

జిమ్ వెళ్తున్నారా? వర్కవుట్ ముందు ఇవి తింటే చాలు!

సప్లిమెంట్స్ ఇష్టం లేని వారికి ఈ సహజ ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అరటిపండు+పీనట్ బటర్ తక్షణ శక్తిని ఇస్తే, బ్లాక్ కాఫీ వర్కవుట్‌పై ఏకాగ్రతను, మెటబాలిజంను పెంచుతుంది. ఓట్స్ ఎక్కువ సేపు అలసిపోకుండా ఎనర్జీని అందిస్తాయి. ఖర్జూరాలు & నట్స్ ఎనర్జీ బూస్టర్లుగా పనిచేస్తాయి. వ్యాయామానికి 30-45 నిమిషాల ముందు వీటిని తీసుకుంటే జిమ్‌లో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

March 5, 2026 / 09:32 AM IST

విదుర నీతి: పనులు పూర్తయ్యేదాకా ఎవరికీ చెప్పకండి

‘తాను చేయబోయే పనిని, వేసుకున్న ప్రణాళికను ముందుగా ఇతరులకు చెప్పకూడదు’ అని విదురుడు సూచించాడు. ఏ వ్యక్తి ఆలోచనలు, నిర్ణయాలు, వ్యూహాలు ఇతరులకు ముందుగా తెలియకుండా పని పూర్తయ్యాక ఫలితం ద్వారా లోకానికి తెలుస్తుందో.. అతడే నిజమైన బుద్ధిమంతుడు. పని మొదలుపెట్టక ముందే గొప్పలు చెబితే ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి కార్యసాధకుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోవాలని విదుర నీతి సారాంశం.

March 5, 2026 / 08:00 AM IST

హోలీ తర్వాత గోళ్లను ఇలా శుభ్రం చేయండి

హోలీ వేడుకల్లో గోళ్లపై పడిన రంగులను వదిలించుకోవడం ఇప్పుడు చాలా సులభం. టూత్‌పేస్ట్ పూసి 10 నిమిషాలు బ్రష్‌తో రుద్ది గోరువెచ్చని నీటితో కడిగితే రంగులు పోతాయి. నిమ్మరసం, బేకింగ్ సోడా మిశ్రమం లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించి కూడా గోళ్లను శుభ్రం చేయవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే మీ గోళ్లు మళ్ళీ మునుపటిలా తెల్లగా, మెరిసేలా అందంగా తయారవుతాయి.

March 4, 2026 / 04:37 PM IST

తరచూ ఫుట్ మసాజ్ చేస్తున్నారా?

క్రమం తప్పకుండా ఫుట్ మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ఒత్తిడి, మడమ నొప్పులు తగ్గుతాయి. రోజూ 5-10 నిమిషాలు ఆయిల్‌తో మసాజ్ చేస్తే కండరాలు రిలాక్స్ అయ్యి హాయిగా నిద్రపడుతుంది. ఇది మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ, నెలసరి సమస్యలను దూరం చేస్తుంది.

March 4, 2026 / 02:25 PM IST

అరటి తొక్కను పడేస్తున్నారా?

సాధారణంగా అందరూ అరటి పండును తిని దాని తొక్కను పడేస్తుంటారు. అయితే దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలా చేయలేరని నిపుణులు అంటున్నారు. అరటి తొక్కలోనూ విటమిన్ ఏ ఇన్యూనిటీకి.. B6, B12 కంటి ఆరోగ్యాన్నికి ఉపయోగపడతాయట. అలాగే దీని వల్ల యెల్లో టీత్, BP కంట్రోల్, మొటిమల నివారణ, చర్మంపై మచ్చల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

March 4, 2026 / 12:32 PM IST

అబ్బాయిలు కూడా HPV టీకా వేసుకోవాలా?

అమ్మాయిలతో పాటు 9-26 ఏళ్ల అబ్బాయిలు కూడా తప్పనిసరిగా HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది పురుషుల్లో వచ్చే గొంతు, నాలుక, జననేంద్రియ క్యాన్సర్లను సమర్థవంతంగా అడ్డుకుంటుందని చెబుతున్నారు. పురుషులకు ఈ క్యాన్సర్లను గుర్తించే స్క్రీనింగ్ పరీక్షలు లేనందున ముందస్తు జాగ్రత్తలే ఉత్తమ మార్గం. కొత్త నియమాల ప్రకారం అబ్బాయిలకు ఒకే ఒక్క డోస్ టీకా సరిపోతుంది.

March 4, 2026 / 11:08 AM IST

విదుర నీతి: ఈ గాయం జీవితాంతం మానదు

చెట్లను గొడ్డలితో నరికినా మళ్లీ చిగురిస్తాయి. ఆయుధాలతో శరీరానికి తగిలిన గాయాలైనా మానుతాయి. కానీ, కఠినమైన మాటలతో మనస్సుపై చేసిన గాయం ఎప్పటికీ మానదని విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పారు. శారీరక గాయాల కంటే మానసిక గాయాలు చాలా లోతైనవి. ఆ మాటలు జీవితాంతం బాధిస్తాయి కాబట్టి, ఇతరులతో మాట్లాడేటప్పుడు పదాలను చాలా జాగ్రత్తగా, ఆచితూచి వాడాలని విదుర నీతి సారాంశం.

March 4, 2026 / 08:00 AM IST