జుట్టుకి కలర్ వేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. జుట్టు మురికిగా ఉంటే రంగు సరిగ్గా అంటుకోదు, అందుకే ముందుగా తలస్నానం చేయాలి. కొత్త రంగు వాడేటప్పుడు అలర్జీ రాకుండా ముందే చెక్ చేసుకోవడం మంచిది. అలాగే తలలో గాయాలు లేదా దురద ఉన్నప్పుడు కలర్ వేస్తే సమస్య ఇంకా పెరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు.