రాత్రిపూట అన్నం మానేసి టిఫిన్ తినడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే ఇడ్లీ, ఉప్మా వంటి పదార్థాలు త్వరగా జీర్ణమై శరీరానికి హాయినిస్తాయి. కానీ, నూనెలో వేయించిన పూరీ, బజ్జీలు తింటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే తేలికపాటి టిఫిన్ ముగించడం ఉత్తమం. జొన్న రొట్టెలు లేదా పెసరట్టు వంటివి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.