• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

ఈ చిట్కాలతో నోటి అల్సర్‌కు చెక్

కొన్ని చిట్కాలతో నోటి అల్సర్‌కు చెక్ పెట్టవచ్చు. అల్సర్ ఉన్న చోట తేనె రాస్తే మంట తగ్గి త్వరగా నయమవుతుంది. కొబ్బరి నూనె యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి నొప్పిని తగ్గిస్తుంది. గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలిస్తే బ్యాక్టీరియా నశిస్తుంది. అలోవెరా జెల్ రాస్తే చల్లదనాన్ని ఇచ్చి పుండును తగ్గిస్తుంది. చలవ చేసే పెరుగు లేదా మజ్జిగ తీసుకుంటే కడుపులో వేడి తగ్గి పూత తగ్గుతుంది.

April 23, 2026 / 01:36 PM IST

ప్రతి మహిళా నిజమైన సూపర్ ఉమెన్

కుటుంబం కోసం మగాడు బయట కష్టపడితే, గృహిణి ఇంట్లో అన్నీ తానై బాధ్యతలు మోస్తుంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టుకుంటుంది. కానీ గృహిణినీ మన సమాజం చులకనగా చూస్తుంది. దీనిని కళ్లకు కట్టినట్లు చూపేలా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి మహిళా నిజమైన సూపర్ ఉమెనే.

April 23, 2026 / 12:13 PM IST

కాంటాక్ట్‌ లెన్సులు వాడుతున్నారా?

నేటి ఆధునిక కాలంలో చాలామంది కళ్ళద్దాలకు బదులుగా కాంటాక్ట్ లెన్సులను వాడుతున్నారు. వీటిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. లెన్సులు పెట్టుకునే ముందు, తీసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని ధరించి నిద్రపోకూడదు. స్నానం చేయకూడదు. కంటికి గాలి తగిలేలా క్రమం తప్పకుండా విరామం ఇవ్వాలి. నాణ్యమైన సొల్యూషన్ వాడటం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

April 23, 2026 / 11:30 AM IST

గోధుమ గ‌డ్డి ర‌సంతో ఆరోగ్య ప్రయోజనాలు

గోధుమ గ‌డ్డి ర‌సంలో విటమిన్లు (A, C, E), మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. రోజూ పరిగడుపున 30ml రసం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోని వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. బరువును తగ్గిస్తుంది.

April 22, 2026 / 10:49 AM IST

ఉదయం అల్పాహారం వల్ల కలిగే లాభాలు

ఉదయం అల్పాహారం తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల పగటిపూట ఎక్కువగా తినడం తగ్గుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. సమతుల్య అల్పాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలను తగ్గించవచ్చు. అల్పాహారంలో ఓట్స్, గుడ్లు, పండ్లు (బెర్రీలు, అరటిపండ్లు), గ్రీక్ పెరుగు, చియా విత్తనాలు, తృణధాన్యాలు చేర్చుకుంటే మంచింది.

April 22, 2026 / 08:23 AM IST

పశ్చిమోత్తనాసనం వల్ల కలిగే ఉపయోగాలు

పశ్చిమోత్తనాసనం వెన్నెముకను సాగదీసి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పొట్ట కండరాలను ఒత్తిడికి గురిచేయడం ద్వారా మసాజ్ చేసి, అజీర్ణం, మలబద్ధకం సమస్యలను తొలగిస్తుంది. మనస్సును శాంతపరచి, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమిని తగ్గించడంలో సహాయపడుతుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో, జీవక్రియ పెంచడంలో సహాయపడుతుంది. క్రమంగా సాధన చేస్తే పొడవు పెరగడానికి దోహదపడుతుంది.

April 22, 2026 / 06:40 AM IST

పిల్లలు ఎత్తు పెరగాలంటే..?

పిల్లల ఎదుగుదలకు పోషకాహారం, నిద్ర, వ్యాయామం చాలా ముఖ్యం. ప్రోటీన్లు, కాల్షియం ఉండే గుడ్లు, ఆకుకూరలు అందించాలి. రోజుకు 8-10 గంటల నిద్రతో పాటు విటమిన్-డి కోసం ఎండలో ఆడుకోనివ్వాలి. స్విమ్మింగ్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలు ఎముకల పుష్టికి, ఎత్తు పెరగడానికి తోడ్పడతాయి. సరైన జీవనశైలితోనే పిల్లల శారీరక వికాసం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

April 21, 2026 / 07:15 PM IST

ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తింటున్నారా?

పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల బ్యాక్టీరియా చేరి కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని అజీర్తి, విరేచనాలకు దారితీస్తుంది. అందుకే పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్దే తినాలి. తిన్న 45 నిమిషాల తర్వాతే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

April 21, 2026 / 06:44 PM IST

వేసవిలో మెరిసే చర్మం కోసం చిట్కాలు..!

ఎండాకాలంలో జిడ్డు, చెమటకాయలు, ట్యాన్ తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచించారు. స్నానపు నీటిలో ఓట్స్ కలపడం, ఐస్ క్యూబ్స్‌తో రుద్దడం, ముల్తానీ మట్టి ప్యాక్ వేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇవి చర్మంపై మురికిని, నూనెను తొలగించి ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ సులభమైన పద్ధతులతో వేసవిలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుకోవచ్చు.

April 21, 2026 / 04:52 PM IST

షాపింగ్ మాల్స్‌లో మేకప్‌ టెస్టర్లు ట్రై చేస్తున్నారా?

షాపింగ్ మాల్స్‌లోని మేకప్ టెస్టర్ల వాడకం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి ద్వారా హెర్పెస్ వైరస్, ఈ-కోలి బ్యాక్టీరియా వ్యాపించి పెదాలపై బొబ్బలు, చర్మ అలర్జీలు, మొటిమలకు దారితీస్తాయి. ఇతరులు వాడిన ఐలైనర్లు, మస్కారాల వల్ల కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. పబ్లిక్ శాంపిల్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది.

April 21, 2026 / 02:42 PM IST

ALERT: ఇంకా భోజనం చేయలేదా..?

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం చేసే విషయంలో జాగ్రత్త చాలా అవసరం. చాలా మంది పనిలో పడి సమయానికి తినరు. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1-2 గంటల లోపే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ భోజనాన్ని నిర్ణీత సమయానికి తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుందంటున్నారు.

April 21, 2026 / 02:00 PM IST

పరగడుపున పచ్చి కొబ్బరి తింటే లాభాలు

పరగడుపున పచ్చి కొబ్బరి తింటే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది తింటే కడుపు నిండుగా అనిపించి, అనవసరపు ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది. ముఖంపై ముడతలు తగ్గి, చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

April 21, 2026 / 12:52 PM IST

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా..?

మనలో చాలా మందికి టీ తాగనిదే రోజు ప్రారంభమవదు. అయితే టీ తాగిన వెంటనే చాలా మంది నీళ్లు తాగుతుంటారు. దీని వల్ల దంతాలపై తీవ్ర ప్రభావం పడి చిగుళ్ల దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు జీర్ణ వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దీని వల్ల ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే టీ లేదా కాఫీ తాగిన 10-15 నిమిషాల తర్వాత నీరు తాగాలి. టీ తాగడానికి ముందు కూడా నీరు తాగడం మంచింది.

April 21, 2026 / 12:45 PM IST

వేసవి తాపానికి ఈ జ్యూస్‌తో చెక్

వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అయి తరచూ దాహాం వేస్తుంది. ఇలాంటి సమయాల్లో కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల తాత్కాలికంగా దాహం తీర్చినప్పటికీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే అత్యంత ఔషధ గుణాలున్న మారేడు పండు తీసుకోవాలి. ఇది శరీరానికి చలువ చేసి, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచతుంది. దీని జ్యూస్, షర్బత్ వేసవి తాపాన్ని తగ్గించి, శక్తిని ఇస్తాయి.

April 21, 2026 / 11:31 AM IST

రోజూ ఉదయాన్నే ఈ పనులు చేస్తే?

ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెటబాలిజం పెరగడం వల్ల కొవ్వు కరుగుతుంది. నీళ్లు తాగిన తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి. బ్రిస్క్ వాకింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది మీ మూడ్‌ను రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది.

April 21, 2026 / 08:13 AM IST