• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

మునగ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు

మునగ ఆకులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. విటమిన్-A వల్ల కంటి సమస్యలు దరిచేరవు.

April 19, 2026 / 09:50 AM IST

‘అక్షయ తృతీయ’ ప్రత్యేకత ఇదే..!

వైశాఖ శుద్ధ తదియ నాడే అక్షయ తృతీయ. ‘అక్షయ’ అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈ పవిత్రమైన రోజున బంగారం కొనుగోలు చేస్తే సిరిసంపదలు వస్తాయని భక్తుల నమ్మకం. దానధర్మాలు, ధ్యానం చేసుకునేందుకు అత్యంత శ్రేష్టమైన తిథి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు శుభప్రదం. ఈ రోజు చేసే జపతపాలు సకల శుభాలను కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు.

April 19, 2026 / 08:50 AM IST

ఉదయం ఎంతసేపు నడిస్తే మంచిదో తెలుసా?

ఉదయపు నడక ఆరోగ్యానికి మంచి చేసే అత్యుత్తమ సహజ మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 30-40 నిమిషాల నడక ఉత్తమమని తెలిపారు. కొత్తగా నడక ప్రారంభిస్తే కనీసం 20 నిమిషాలతో ప్రారంభించాలని చెప్పారు. రోజూ 30 నిమిషాలు వేగంగా నడవటం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం చాలా వరకు తగ్గుతాయని వెల్లడించారు. రోజూ నడవడం కీళ్లు, ఎముకల బలానికి మంచిదని పేర్కొన్నారు.

April 19, 2026 / 06:06 AM IST

అరటిపండు షేప్‌ అలా ఎందుకు ఉంటుంది?

అరటి చెట్టుకి కాసిన గెల కిందకు వేలాడుతున్నా దాని పండ్లు మాత్రం ఆకాశం వైపుకు చూస్తుంటాయి. దీన్ని ‘నెగటివ్‌ జియోట్రోపిజం’ అంటారు. అంటే సూర్యుడి వైపు పెరగడం. అందుకే అరటిపండు షేప్‌ వంకరగా వస్తుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువ. అది గుండెకు, కండరాలకు మంచిది. పండిన అరటిపండు మీద నల్ల మచ్చలు వస్తాయి. వాటిని షుగర్‌ స్పాట్స్‌ అంటారు.

April 18, 2026 / 04:04 PM IST

‘6-6-6’ రూల్ ఏంటో తెలుసా?

ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ‘6-6-6’ వాకింగ్ రూల్ అద్భుతంగా పనిచేస్తుంది. దీని ప్రకారం ఉదయం 6 లేదా సాయంత్రం 6 గంటలకు 60 నిమిషాలు నడవాలి. నడకకు ముందు 6 నిమిషాల వార్మప్, తర్వాత 6 నిమిషాల కూల్-డౌన్ తప్పనిసరి. ఇది బరువు తగ్గించడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫిట్‌గా ఉండాలనుకునే వారు ఈ సులభమైన చిట్కాను రోజూ పాటించడం ఎంతో మేలు.

April 18, 2026 / 03:40 PM IST

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే కలిగే లాభాలు

కొబ్బరి నీళ్లు దాహాన్ని తీర్చడమే కాదు.. ఇది సహజమైన శక్తి పానీయం. మధ్యాహ్నం వేళ వచ్చే బద్ధకాన్ని, అలసటను తక్షణమే దూరం చేస్తుంది. దీనిలోని పొటాషియం అలసిపోయిన కండరాలకు విశ్రాంతినిచ్చి, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

April 18, 2026 / 02:20 PM IST

ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపులు ఎందుకు?

గర్భిణుల్లో రక్తహీనత, అధిక రక్తపోటు లేదా బరువు వల్ల కాళ్ల వాపులు రావడం సాధారణం. అయితే, ఒక్కరోజులోనే వాపు విపరీతంగా పెరిగినా లేదా ఒకే కాలు వాపు వచ్చినా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వాపు వచ్చిన చోట నొక్కితే పడిన సొట్ట త్వరగా మామూలు స్థితికి రాకపోవడం ప్రమాదకరం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

April 18, 2026 / 12:06 PM IST

బరువు తగ్గడానికి 30-30-30 రూల్!

బరువు తగ్గాలనుకునే వారికి 30-30-30 రూల్ చక్కని పరిష్కారం. రోజువారీ అవసరం కంటే 30% తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ తప్పనిసరి. గ్యాడ్జెట్స్‌ పక్కన పెట్టి, 30 నిమిషాల పాటు ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నమిలి తినాలి. ఇది అతిగా తినడాన్ని నియంత్రించి, బరువును అదుపులో ఉంచుతుంది.

April 18, 2026 / 12:04 PM IST

రోజూ తలస్నానం చేస్తే జుట్టు పాడవుతుందా?

రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు పాడవుతుందనేది కేవలం అపోహ మాత్రమే. అది మీ జుట్టు రకాన్ని బట్టి ఉంటుంది. జిడ్డు జుట్టు ఉన్నవారికి ఇది మంచిది, కానీ పొడి జుట్టు ఉన్నవారికి తరచూ షాంపూ వాడటం వల్ల జుట్టు పొడిబారి, బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంది. అయితే సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూలను వాడటం ఉత్తమం. మీ జుట్టు తత్వాన్ని బట్టి సరైన షాంపూ ఎంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

April 18, 2026 / 11:37 AM IST

రోజూ ఐ మేకప్ వాడుతున్నారా? జాగ్రత్త!

రోజూ కాటుక, మస్కారా వాడటం వల్ల వాటిలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్లు కళ్ల సహజ మెరుపును దెబ్బతీస్తాయి. అందుకే ఎప్పుడూ నాణ్యమైన ఉత్పత్తులనే ఎంచుకోవాలి. ఇన్ఫెక్షన్ల భయం ఉంటుంది కాబట్టి మేకప్ కిట్‌ను ఇతరులతో పంచుకోకూడదు. అలాగే కళ్లకు మేకప్ వేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ప్రాథమిక సూత్రం. వీటిని పాటిస్తే అందంతో పాటు కళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

April 18, 2026 / 10:41 AM IST

ట్రిప్‌లో ఖర్చులు తగ్గించుకోవాలా?

ప్రయాణంలో పొదుపు పాటించాలంటే టికెట్లను కొన్ని నెలల ముందే బుక్ చేసుకోవాలి. చివరి నిమిషంలో బుకింగ్స్ వల్ల ధరలు భారమవుతాయి. పర్యాటక ప్రాంతాల్లో తిరగడానికి ఖరీదైన క్యాబ్‌ల కంటే ప్రజారవాణాను వాడటం మేలు. గైడ్లను నియమించుకోకుండా ఆన్‌లైన్‌లో సమాచారం చూసుకోవచ్చు. ఖరీదైన హోటళ్లకు బదులుగా హాస్టల్స్ లేదా క్యాంపింగ్ ఎంచుకుంటే తక్కువ ఖర్చుతోనే విహారయాత్రను పూర్తి చేయొచ్చు.

April 18, 2026 / 08:16 AM IST

విహారయాత్ర ప్లాన్ చేస్తున్నారా?

విహారయాత్రలకు బడ్జెట్ సమస్య కాకూడదంటే ముందస్తు పొదుపు అవసరం. రోజువారీ ఖర్చులైన టీ, కాఫీలను తగ్గించడం, అనవసరమైన ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను కట్ చేస్తే కొంత డబ్బు ఆదా చేయొచ్చు. నెలలో కొన్నిసార్లు బయట తినడం మానేసి, ఆ మొత్తాన్ని ఒక ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఉపయోగించి విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్‌లో భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.

April 18, 2026 / 08:10 AM IST

జనం ఏమనుకున్నా సరే.. రిస్క్ చేయకండి!

అందం కోసం కొందరు ఫేస్ లిఫ్ట్ ఇంజెక్షన్లను వాడుతున్నారు. కానీ ఇవి వాపు, దద్దుర్లు, చర్మ కణజాలం శాశ్వతంగా చనిపోయేలా(టిష్యూ నెక్రోసిస్) చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జనం ఏదో అనుకుంటారని, సామాజిక ఒత్తిడితో ఇలాంటి ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకోవద్దు. సహజమైన యోగా, డైట్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్యం. అందం కంటే ఆరోగ్యమే మిన్న అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

April 18, 2026 / 07:57 AM IST

పెళ్లి ముందు ఈ ఇంజెక్షన్లు వాడుతున్నారా?

పెళ్లికి ముందు బరువు తగ్గాలని చాలామంది షార్ట్‌కట్ మార్గాలు వెతుకుతున్నారు. డయాబెటిస్ బాధితులకు ఇచ్చే టర్‌జెపటైడ్, సెమాగ్లూటైడ్ వంటి ఇంజెక్షన్లను బరువు తగ్గడానికి వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇవి తాత్కాలికంగా బరువు తగ్గించినా, ఆపగానే మళ్లీ రెట్టింపు బరువు పెరగడం, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. నిపుణుల సలహా లేకుండా ఇవి వాడటం శ్రేయస్కరం కాదు.

April 18, 2026 / 07:19 AM IST

దండాసనం వల్ల కలిగే ఉపయోగాలు

దండాసనం వెన్నెముకను నిటారుగా ఉంచి, శరీరాన్ని దృఢంగా మార్చే యోగాసనం. ఈ ఆసనం వెన్నెముకను బలోపేతం చేసి, నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. వెనుక నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో, ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఉదర కండరాలను టోన్ చేయడం ద్వారా జీర్ణక్రియను పెంచుతుంది. ఛాతీని విస్తరించడం ద్వారా శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

April 18, 2026 / 06:26 AM IST