గర్భిణుల్లో రక్తహీనత, అధిక రక్తపోటు లేదా బరువు వల్ల కాళ్ల వాపులు రావడం సాధారణం. అయితే, ఒక్కరోజులోనే వాపు విపరీతంగా పెరిగినా లేదా ఒకే కాలు వాపు వచ్చినా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వాపు వచ్చిన చోట నొక్కితే పడిన సొట్ట త్వరగా మామూలు స్థితికి రాకపోవడం ప్రమాదకరం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.