షాపింగ్ మాల్స్‌లోని మేకప్ టెస్టర్ల వాడకం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి ద్వారా హెర్పెస్ వైరస్, ఈ-కోలి బ్యాక్టీరియా వ్యాపించి పెదాలపై బొబ్బలు, చర్మ అలర్జీలు, మొటిమలకు దారితీస్తాయి. ఇతరులు వాడిన ఐలైనర్లు, మస్కారాల వల్ల కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. పబ్లిక్ శాంపిల్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది.