జుట్టు గడ్డిలా తయారైతే ఈ చిట్కాలు పాటించండి. వారానికి రెండుసార్లు కొబ్బరి లేదా బాదం నూనెతో మసాజ్ చేయాలి. తలస్నానం తర్వాత తప్పనిసరిగా కండిషనర్ వాడాలి. హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లు వాడటం తగ్గించాలి. పెరుగు, గుడ్డు లేదా కలబంద గుజ్జును ప్యాక్‌లా వేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది. ప్రతి 6-8 వారాలకు జుట్టు చివర్లను కత్తిరించడం వల్ల చిట్లిన జుట్టు సమస్య తగ్గుతుంది.