ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా శక్తి, మెరుగైన జ్ఞాపకశక్తి, స్థిరమైన జీవక్రియ లభిస్తాయి. ఇది బరువు నియంత్రణలో ఉంచడమే కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. 8 నుంచి 10 గంటలలోపు ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని (ఇడ్లీ, మొలకలు, గుడ్లు, ఓట్స్) తీసుకోవడం చాలా ఉత్తమం.