SRCL: వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కు చెందిన 60 ఏళ్ల మహిళ రొమ్ములో గడ్డతో వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి రావడం జరిగింది. షుగర్ వ్యాధితో చాలా ఏళ్లుగా బాధ పడుతున్న ఆమెకు నోటిని పూర్తిగా తెరవడంలో కూడా ఇబ్బంది ఎదురైంది. ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు.