• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి’

ADB: ఇటీవల కురిసిన వర్షానికి పలువురి ఇల్లు కూలిపోవడంతో బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ హామీ ఇచ్చారు. మంగళవారం నార్నూర్ మండలం పుసిగూడలో పర్యటించారు. బాధితుల ఇళ్లను పరిశీలించి పూర్తి వివరాలను సేకరించారు.

June 2, 2026 / 09:50 PM IST

పట్టణంలో వేగ నియంత్రణకు పటిష్ట చర్యలు: CI

MBNR: రోడ్డు ప్రమాదాల నివారణకు వేగాన్ని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు మహబూబ్ నగర్ రెండవ పట్టణ సీఐ ఐజాజుద్దీన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు, కాషన్ బోర్డులు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో మొత్తంగా 40 ప్రాంతాలలో బ్లాక్ స్పాట్స్ గుర్తించామన్నారు.

June 2, 2026 / 09:49 PM IST

‘తెలంగాణ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది’

TG: రాష్ట్రంలో, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికారాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైసింగ్ 2047’ విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

June 2, 2026 / 09:48 PM IST

‘NBK-111’ నుంచి అదిరిపోయే UPDATE

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK-111’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. జూన్ 10న బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి ‘ఎక్స్‌ప్లోసివ్ అప్‌డేట్’ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ SMలో వైరల్ అవుతోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష...

June 2, 2026 / 09:46 PM IST

VSP – VJA ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

AP: విశాఖ- విజయవాడ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై విమానాన్ని తిరిగి విశాఖలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇదే విమానంలో YCP MLC బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఎయిరిండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. 

June 2, 2026 / 09:42 PM IST

నెట్ బౌలర్‌గా జమ్మూకాశ్మీర్ స్పీడ్‌స్టార్

అఫ్ఘానిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు జమ్మూకాశ్మీర్ స్పీడ్‌స్టార్ ఆకిబ్ నబీకి చోటు దక్కకపోవడంతో బీసీసీఐపై విమర్శల వర్షం కురిసింది. దీంతో ఈ విమర్శలకు తలొగ్గిన బీసీసీఐ.. ప్రస్తుతానికి అతడిని ఈ సిరీస్‌కు నెట్ బౌలర్‌గా ఎంపిక చేసింది. అయితే, సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి, అతడి స్థానంలో నబీకి ప్రధాన జట్టులో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

June 2, 2026 / 09:42 PM IST

BRSకు ఓటుతో బుద్ధి చెప్పండి: టీపీసీసీ చీఫ్

TG: జలమండలి ఎన్నికల్లో మిగులు బడ్జెట్ తెలంగాణను అప్పుల పాలు చేసిన BRSకు కార్మికులు ఓటుతో బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. జలమండలి కార్మికుల సమస్యల పరిష్కారానికి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు.

June 2, 2026 / 09:40 PM IST

నిరుద్యోగులను కలిసే ధైర్యం సీఎంకు ఉందా?: కేటీఆర్

TG: అబద్ధపు హామీలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను 25 ఏళ్లు వెనక్కి నెట్టిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, రైతుబంధు ఆగిపోయిందని మండిపడ్డారు. నిరుద్యోగులను కలిసే ధైర్యం సీఎంకు ఉందా” అని KTR సవాల్ విసిరారు.

June 2, 2026 / 09:38 PM IST

కూర్చుని పనిచేస్తున్నారా..? జాగ్రత్త!

గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేసే వారికి వెన్నునొప్పి, ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రతి గంటకు ఒకసారి సీట్లో నుంచి లేచి 5 నిమిషాల పాటు అటుఇటు నడవాలి. స్ట్రెచింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. డెస్క్ జాబ్స్ చేసేవారు ఈ చిన్న చిట్కా పాటిస్తే వెన్నుపూస సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు.

June 2, 2026 / 09:35 PM IST

సింధు విజయం.. లక్ష్యసేన్ ఔట్

ఇండోనేషియా ఓపెన్-2026 తొలి రోజున భారత బృందం మిశ్రమ ఫలితాలను చవిచూసింది. థాయ్‌లాండ్ ప్లేయర్ బుసనన్‌తో జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు.. 25-23, 21-16 తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. అయితే, పురుషుల సింగిల్స్‌లో ఇండోనేషియా ప్లేయర్ అల్వి ఫర్హాన్ చేతిలో 19-21, 16-21 తేడాతో ఓడిపోయిన లక్ష్యసేన్.. టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

June 2, 2026 / 09:33 PM IST

చరణ్ ‘RC17’ స్టార్ట్ అయ్యేది అప్పుడే!

రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రమోషన్స్ పూర్తి కాగానే ఓ చిన్న సర్జరీ చేయించుకోనున్నాడట. ఆ తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని, పూర్తిగా కోలుకున్నాక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘RC17’పై ఫోకస్ పెట్టనున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై జూలైలో అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం సుకుమార్ ఈ మూవీ ఫైనల్ స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉండగా.. దసరా తర్వాత ఇది పట్టాలెక్కనున్నట్లు టాక్.

June 2, 2026 / 09:33 PM IST

మంత్రి నారాయణతో CRRI ప్రతినిధుల భేటీ

AP: మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(CRRI) ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో నిర్మిస్తున్న జోనల్ ఇంటర్నల్ రోడ్లు, డ్రెయిన్లు, పవర్ లైన్లను CRRI ప్రతినిధులు గత 2 రోజుల పాటు అధ్యయనం చేశారు. తాము గుర్తించిన అంశాలను మంత్రితో చర్చించారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి సూచనలు చేశారు. త్వరలో ప్రభుత్వానికి CRRI ప్రతినిధులు పూర్తి నివేదిక ఇవ్వనున్నారు.

June 2, 2026 / 09:32 PM IST

ఇరిగేషన్ శాఖ డీఈ, ఏఈ బదిలీ

MDK: తూప్రాన్ ఇరిగేషన్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో అధికారులు బదిలీ అయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డీఈ శ్రీకాంత్‌ను ఎల్లారెడ్డి సబ్ డివిజన్‌కు బదిలీ చేయగా, ఏఈ అనురాధను దౌల్తాబాద్ మండలానికి బదిలీ చేశారు. తూప్రాన్ ఇరిగేషన్ కార్యాలయ కొత్త డీఈ గా కరుణ నియామకం కాగా, ఆమెతో పాటు మరో ఇద్దరు ఏఈలను కూడా ప్రభుత్వం ఇక్కడకు నియమించింది.

June 2, 2026 / 09:30 PM IST

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

WGL: గీసుగొండ మండలానికి చెందిన కౌలు రైతు చాపర్తి రమేష్ (45) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్వంత భూమితో పాటు కౌలుకు భూమి తీసుకుని సాగు చేసినప్పటికీ పంటలు ఆశించిన మేర దిగుబడి ఇవ్వకపోవడంతో అప్పులు పెరిగాయి. తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్ పురుగుల మందు తాగగా, ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

June 2, 2026 / 09:30 PM IST

అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలి: డీజీపీ

PDPL: ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు పోలీస్ శాఖ అధికారులు అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సీవి ఆనంద్ సూచించారు. ఆయన ఇవాళ కలెక్టర్లు, అధికారులతో C.S రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు భద్రతా అంశాలపై గ్రామ సభలలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీ హర్ష, అధికారులు పాల్గొన్నారు.

June 2, 2026 / 09:30 PM IST