ఇండోనేషియా ఓపెన్-2026 తొలి రోజున భారత బృందం మిశ్రమ ఫలితాలను చవిచూసింది. థాయ్‌లాండ్ ప్లేయర్ బుసనన్తో జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు.. 25-23, 21-16 తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. అయితే, పురుషుల సింగిల్స్‌లో ఇండోనేషియా ప్లేయర్ అల్వి ఫర్హాన్ చేతిలో 19-21, 16-21 తేడాతో ఓడిపోయిన లక్ష్యసేన్.. టోర్నీ నుంచి నిష్క్రమించాడు.