PDPL: ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు పోలీస్ శాఖ అధికారులు అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని డీజీపీ సీవి ఆనంద్ సూచించారు. ఆయన ఇవాళ కలెక్టర్లు, అధికారులతో C.S రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు భద్రతా అంశాలపై గ్రామ సభలలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీ హర్ష, అధికారులు పాల్గొన్నారు.