BDK: మణుగూరు బీసీ బాలుర వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థులు తీసుకున్న ఆహార వివరాలను DMHO మంగళవారం అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన, చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అనంతరం వసతి గృహానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు.