GNTR: ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ సీ.యం. సాయి కాంత్ వర్మ అన్నారు. నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు ఆ శాఖకు బాస్ అన్నారు. శాఖకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు.