MDK: రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ. 40 కోట్లతో బైపాస్ రోడ్డు, రూ. 30 కోట్లతో గెస్ట్ హౌస్ మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రతిపాదనలు సమర్పించారు. మున్సిపల్ ఛైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, సీనియర్ నాయకుడు గజవాడ నాగరాజు, వైస్ ఛైర్మన్ నవనీత గణేష్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.