HYD: PVNR మార్గమ్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు HMDA రూ.1.13 కోట్లతో పనులు చేపట్టింది. ఇందులో భాగంగా చిన్నారుల కోసం అత్యాధునిక ఆట పరికరాలు, ఫిట్నెస్ ప్రియుల కోసం ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సందర్శకులు సేద తీరేందుకు అందమైన బెంచీలు, పెర్గోలాలు అందుబాటులోకి వస్తాయి. నగరవాసుల ఆరోగ్యం, ఉల్లాసమే లక్ష్యంగా ఈ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.