SRD: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జోగిపేటలో న్యాయవాదులు మంగళవారం సంబరాలు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రారెడ్డి మాట్లాడుతూ.. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు నారాయణరెడ్డి, జహంగీర్ రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.