NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని మినీ స్టేడియంలో కబడ్డీ కోచ్ నరసింహ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణపేట జిల్లా యువజన క్రీడా అధికారి వెంకటేష్ శెట్టి సమ్మర్ కబడ్డీ క్యాంప్‌ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఇలాంటి క్యాంపులు గ్రామీణ ప్రాంత యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తాయన్నారు. అలాగే వారి ప్రతిభను పరిచయం చేసి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు.