ADB: బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ, వారి సేవలను భావితరాలకు చాటిచెప్పేలా కార్యక్రమాలను రూపొందించాలని కోరారు.