RR: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 205 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 170 బైకులు, 8 త్రీవీలర్, 27 ఫోర్ వీలర్లు పట్టుబడ్డాయని తెలిపారు. వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.