NLG: నల్గొండకు చెందిన ఫొటోగ్రాఫర్ మధుకు ఫొటోగ్రాఫర్స్ యూనియన్, ఫొటో పరివార్ సభ్యులు అండగా నిలిచారు. ఇటీవల ఓ శుభకార్యంలో జరిగిన గొడవలో మధు కెమెరా ధ్వంసం కాగా, తోటి సభ్యులు చందాలు వేసుకుని రూ.2.50 లక్షల విలువైన కొత్త కెమెరాను కొనుగోలు చేశారు. శనివారం తిరుమలగిరి ఎస్సై వీరశేఖర్ చేతుల మీదుగా బాధితుడికి దీనిని అందజేశారు.