NTR: నందిగామ వై జంక్షన్ వద్ద హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం మార్గదర్శకత్వంలో ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు అవసరమని వివరించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.