ప్రకాశం: త్రిపురాంతకంలో యర్రగొండపాలెం నియోజకవర్గ TDP పార్టీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు బుధవారం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వచ్ఛ రథం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. చెత్తను ఇచ్చి సరుకులు, ఇతర వస్తువులను తీసుకోవచ్చని ప్రతి ఒక్కరూ ఈ అవకాశన్ని ఉపయోగించుకోవాలని ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు.