TG: రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. 2025-26 ఏడాదికి గానూ ఏకంగా రూ.40,209 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.20,859 కోట్లుగా ఉండగా.. కేవలం ఏడు సంవత్సరాల్లోనే ఇది రెట్టింపు స్థాయికి చేరుకోవడం విశేషం. గత ఏడాది రూ.37,487 కోట్ల ఆదాయం వచ్చింది. ఏడాదిలో 536.13 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరగడం గమనార్హం.