TG: హుజూరాబాద్ సమీపంలోని సిర్సపల్లిలో ప్రభుత్వం ప్రతిపాదించిన వెస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 3న హుజూరాబాద్ బంద్కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.