మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా సమస్యలను పరిష్కరించాలని ఏసీపీ ప్రకాష్, ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావును ఆదేశించారు.