కృష్ణా: జిల్లాలోని పోలీస్ రేంజ్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో పూర్తిస్థాయి తనిఖీలు చేపడుతున్నామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రమాదకరమైన మందుగుండు సామగ్రి ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే నిర్వీర్యం చేస్తామని హెచ్చరించారు.